త్రికూటేశ్వర స్వామి దేవాలయము
ప్రాంతము :గుంటూరు జిల్లా నరసరావుపేట
ఆలయ చరిత్ర :
కోటప్పకొండ అసలుపేరు త్రికూటాచలము. ఈ కొండను ఏ కోణం నుండి చుసిన మూడు శిఖరాలు కనపడుతుంటాయి అవి బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరం, రుద్ర శిఖరం అందువలన దీనికి త్రికూటాచలమని పేరు వచ్చింది.
అందువలన ఇక్కడ స్వామిని త్రికూటేశ్వరుడు అని అంటారు. దక్ష యజ్ఞము భగ్నం చేసిన తరువాత స్వామి వారు ఈ శిఖరం పైన తపస్సు చేసి అక్కడే లింగ రూపము ధరించెను.
అందువలన ఈ శిఖరమును రుద్ర శిఖరము అని పిలుస్తారు. ఈ శిఖరం పైన పాత కోటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఆరుద్రోత్సవం సందర్భముగా కర్పూర జ్యోతి దర్శనం జరుగుతుంది.
దక్షయజ్ఞంలో పాల్గొన్న దేవతలు, ఋషులు స్వామిని ప్రార్ధించగా స్వామి ప్రత్యక్షమై విష్ణుమూర్తి కోరికమేరకు పాపవిమోచనేశ్వర స్వామి గా ఈ విష్ణు శిఖరం ఫై కొలువైనాడు ఇక్కడే ఒక కోనేరు కూడా కలదు అందులో స్నానమాచరించిన పాపములు తొలగునని భక్తుల విశ్వాసము.
బ్రహ్మ శిఖరము ఫై బ్రహ్మ తపమాచరించి శివుని లింగరూపమున తన శిఖరము ఫై కొలువుండమని కోరగా శివుడు అంగీకరించెను కావున బ్రహ్మశిఖరము ఫై నేటి వైభవములు పొందుతున్న క్రొత్త కోటేశ్వరస్వామి గా పూజలు అందుకొనుచున్నాడు.
పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీ.శ 1172 లో నిర్మించారని తెలుస్తున్నది.
స్థలపురాణం :
పూర్వము కోటప్పకొండకు సమీపములో దక్షిణముగా కొండకావూరు అను పల్లె కలదు ఆ ఊరిలో సుందుడు, కుంద్రి అనే దంపతులు కలరు వారికి ఆనందవల్లి అనే కూతురు ఉన్నది ఆమె అమితమైన శివభక్తురాలు.
రోజు ఆమె రుద్రాచలానికి వచ్చి శివునికి అభిషేకం చేసి పాలు నైవేద్యంగా సమర్పించేది. ఒకరోజు కుండనిండా నీరు తీసుకుని వెళుతూ మార్గమధ్యములో ఒకేచోట ఆగి మారేడు దళముల కోసం వెళ్లగా ఒక కాకి ఆ కుండమీద వాలినది దానితో ఆ కుండ కింద పడి నీరు మొత్తం పోయినవి.
దీంతో ఆగ్రహించిన ఆనందవల్లి ఆ ప్రాంతానికి కాకులు రాకూడదని శపించినది. (ఈనాటికి ఆ ప్రదేశంలో మనకు కాకులు కనిపించవు).
ఆనందవల్లి భక్తికి మెచ్చిన శివుడు జంగమదేవర రూపంలో ప్రత్యక్షమై ఆమెకు జ్ఞానము ప్రసాదించెను. అంతటితో ఆగకుండా ఆమె తపస్సు చేసినది జంగమదేవర మరలా ప్రత్యక్షమై కుటుంబజీవితం కొనసాగించమని బ్రహ్మచారిణి ఆయన ఆమెకు గర్భాన్ని ప్రసాదించెను.
అయినా ఆమె మరలా తపస్సు చేసినది జంగమదేవర మళ్ళీ ప్రత్యక్షమై ఇకనుండి నీవు రుద్రాచలం రావలసిన అవసరం లేదని తనే ఆమె ఇంటికి వచ్చి పూజలు స్వీకరిస్తానని చెప్పి ఆమెను వెనక్కి
తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళమనెను అలాకాకుండా వెనక్కి తిరిగిచూస్తే తాను అక్కడే శిల అయిపోతానని చెప్పెను అతని ఆదేశంమేరకు ఆనందవల్లి ఇంటికి వెళుతూ మార్గమద్యంలో వెనక్కి తిరిగి చూసినది వెంటనే శివుడు
పక్కనే ఉన్న గుహలో లింగరూపం ధరించెను ఆ పవిత్ర ప్రదేశమే ప్రస్తుతం కోటేశ్వరాలయము గా పిలవబడుతుంది.
ఉత్సవాలు :
ప్రతి ఏటా మహాశివరాత్రి నాడు ఇక్కడ జరిగే ప్రభ ల సంబరం ఆకాశాన్ని అంటుతుంది. కోటప్పకొండ ప్రభలకు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు ఉంది.
చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక ఇతర రాష్టాలనుండి కూడా ఇక్కడకు వస్తుంటారు. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.



No comments:
Post a Comment